మీ మొబైల్ ఎక్స్-ఛేంజ్ చేస్తున్నారా.. జాగ్రత్త

        మీరు మీ పాత ఫోన్ తో విసుగెత్తిపోయి కొత్త ఫోన్ కోసం దాన్ని ఎక్స్-ఛేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఎక్స్-ఛేంజ్ చేసుకునే ముందు మీకొక హెచ్చరిక.

telugutechy-mobile-hack

       మీరు ఆ ఫోన్లో మీ బ్యాంకు ఖాతాలు, పాస్ వర్డ్ లు, పర్సనల్ ఫొటోలు, వీడియోలు, కీలకమైన మెయిల్ లను వాడి ఉంటే.. ఆ ఫోన్ ను ఎక్స్-ఛేంజ్ చేసుకోకపోవడమే మేలు. ఎందుకంటే హ్యాకర్లు ఇప్పుడు మొబైల్ ఫోన్లనే టార్గెట్ చేసుకున్నారు మరి. మీరు ఆ ఫోన్ ను ఫార్మాట్ చేసేసినప్పటికీ.. అందులోని ప్రతి అణువణువూ గాలించి కోడ్ లను క్రాక్ చేసి మీరు డిలీట్ చేసిన సమాచారాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. వీరు ప్రధానంగా ఎక్స్ఛేంజ్ ఫోన్ల పైనే కన్నేశారు. ఈ ఫోన్లయితే చాలా ఈజీగా సమాచారం పొందడానికి అవకాశముంటుందని ఓ టెక్నాలజీ నిపుణుడు తెలిపారు.

‘‘ఎక్స్ఛేంచ్ చేసుకున్న ఆ ఫోన్లలో వాడిన ఫోన్ బ్యాంకింగ్, ఈ-షాపింగ్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పాస్ వర్డ్ లు, ఫొటోలు, వీడియోలకు సంబంధించిన విలువైన సమాచారం ఇప్పుడు చాలా సులభంగా హ్యాకర్లకు దొరికేస్తోంది’’అని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ డైరెక్టర్ సందీప్ గుప్తా చెప్పారు. ‘‘మీరు ఫోన్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మెమరీ నుంచి డేటా డిలీట్ చేసినప్పటికీ.. సైబర్ నేరగాళ్లు వాటిని చాలా సులభంగా తిరిగి పొందగలుగుతున్నారు. అది కొత్త మోడల్ అయినా.. పాత మోడల్ అయినా ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడమంటే చాలా పెద్ద తప్పుచేస్తున్నట్టేనని చెప్పాలి’’ అని ఆయన అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఫోన్ మార్పిడి చేసుకోవాలని అనుకుంటే.. అందులో డేటాను డిలీట్ చేయడానికి బదులు దాంట్లో వేరే డేటాను ఓవర్ రైట్ చేయడం మనం తీసుకోదగని ముందు జాగ్రత్త అని ఆయన సలహా ఇచ్చారు.



Comments