Xender: ఇంటర్నెట్ లేకుండా అత్యంత వేగంగా Android Apps డౌన్లోడ్..

మీరు ఒక్కసారి దీన్ని ఇన్ స్టాల్ చేసి ట్రై చేస్తే ఈ అప్లికేషన్ నుమళ్లీ తీయాలన్నా తీయలేనంతగా ఇష్టపడతారు. వైఫై లేకున్నా,3జీ లేకున్నా, సిమ్ లేకున్నా సరే మీరుమిత్రుని ఫోన్ కు మీ అప్లికేషన్లుబదిలీ చేయొచ్చు. ఎలాంటిఇంటర్నెట్ ఖర్చూ ఉండదు.

xender-telugu-techy

అవునండీ.. నిజంగా నిజం.. ఇంటర్నెట్ లేకుండా, అదీ అత్యంత వేగంగా.. ఎంత వేగంగా అంటే 50 MB ఉన్న Android అప్లికేషన్లు కూడా కేవలం క్షణాల్లోనే మీ ఫోన్లోకి వచ్చేసే అద్భుతమైన అప్లికేషన్ ఇది. పేరు Xender. కొందరు దీన్ని జెండర్ అని అంటే.. మరికొందరు ఎక్స్ ఎండర్ అని అంటున్నారు.. నాకు తెలిసి దీన్ని ఎక్స్ఎండర్ అనే అనాలి.

ఇదీ చదవండి: ప్రకటనలు లేకుండా యూట్యూబ్ వీడియో చూడండిలా(వీడియో..

v   ఈ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది.. కింది లింక్ ద్వారా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
Xender (Playboard) | Xender (Play Store)
v   మీ మిత్రుల ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న ఏ అప్లికేషన్ ను అయినా సరే ఈ Xender అప్లికేషన్ ద్వారా మీ ఫోన్లోకి కేవలం క్షణాల్లో బదిలీచేసుకోవచ్చు.
v   అయితే ఇద్దరి ఫోన్లలోనూ ఈ అప్లికేషన్ ఉండాలి. ఒకరి ఫోన్లో ఉంటే.. బ్లూటూత్ కనెక్షన్ ద్వారా రెండో మిత్రునికి ఆ అప్లికేషన్ పంపడానికి Xender అప్లికేషన్లోనే ప్రత్యేకమైన ఆప్షన్ ఉంది.
v   రెండు ఫోన్లలోనూ అప్లికేషన్లు ఆన్ చేసి.. నచ్చిన ఇతర అప్లికేషన్లను చూసుకొని క్లిక్ చేసి జస్ట్ ఫోన్ ను అటూ ఇటూ ఊపితే చాలు.. రెండు మూడు క్షణాల్లో ఆ అప్లికేషన్ మీ మిత్రుని ఫోన్లో నుంచి మీకు వచ్చేస్తుంది. మీ నుంచి తనకు కూడా పంపుకోవచ్చు.
(ఎలా వినియోగించాలో.. ఈ వీడియోలో చూడండి)



v   ఈ సౌకర్యం కేవలం అప్లికేషన్లు పంపుకోవడానికే కాకుండా.. వీడియోలు, ఫొటోలు, పాటలు కూడా అటూ ఇటూ షేర్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.

ఇధీ చదవండి: యాహూ నుంచి అదిరిపోయే ఆండ్రాయిడ్ లాంచర్(ఇంగ్లిష్)

సెకనుకు 4 ఎంబీ

v   సెకనుకు 4 ఎంబీ వేగంగా అప్లికేషన్లు, ఫైల్స్ ట్రాన్స్ ఫర్ అవుతాయి.
v   గతంలో దీన్నే ఫ్లాష్ ట్రాన్ష్ ఫర్ అప్లికేషన్ గా పరిచయం. Xender దాని కొత్త  రూపం.
v   ఏవీజీ లాంటి యాంటివైరస్ లు దీన్ని మాల్వేర్ గా చూపిస్తున్నాయి. కానీ ఇంతవరకు ఇది మాల్వేర్ అని వేరే ఏ యాంటీవైరస్ ధ్రువీకరించలేదు.

Comments