చిట్కా: అనుకోకుండా క్లోజ్ చేసిన ట్యాబ్ మళ్లీ తెరవడమెలా?

undo-close-tab

మనం ఏదైనా బ్రౌజర్ లో సెర్చ్ చేసేటపుడు చాలా ట్యాబ్ లు ఓపెన్ చేస్తుంటాం. పనికిరాని వాటిని క్లోజ్ చేసే సమయంలో మనకు ఉపయోగం అనుకున్నదాన్ని కూడా అనుకోకుండా క్లోజ్ చేసేస్తుంటాం. కానీ ఆ ట్యాబ్ ను మనం మళ్లీ తిరిగి తెచ్చుకోవచ్చు. దానికి రెండు ఆప్షన్లున్నాయి. ఒకటి Ctrl+Shft+T. ఇది షార్ట్ కట్. ఇక రెండోది ఏదో ఒక ట్యాబ్ పై క్లిక్ చేసి "Reopen closed tab"(chrome) లేదా "Undo close Tab"(firefox) అన్న ఆప్షన్ ఎంచుకోవడమే. మీరు ఒకటి కంటే ఎక్కువ ట్యాబ్ లు క్లోజ్ చేసి ఉంటే.. ఇదే ఆప్షన్ ను మళ్లీ మళ్లీ ఉపయోగించి వాటిని కూడా తిరిగి పొందొచ్చు.

Comments