Google లోగో మారింది

అవునండీ.. గూగుల్ Logo మారింది. కానీ విశేషమేంటంటే.. సాధారణ మనుషులెవరూ ఆ మార్పును గుర్తించలేరు. కావాలంటే కింద ఇచ్చిన Google logo GIF చూడండి మార్పు ఎంత చిన్నగా ఉందో.. ఇలాంటి మార్పులు గూగుల్ ఎందుకు చేసిందో అర్థం కాలేదు. కానీ మాషబుల్ అనే మేగజైన్ దీనిపై గూగుల్ ను సంప్రదిస్తే.. ‘‘మీ స్క్రీన్ రిజల్యూషన్ ఎలా ఉన్నా సరే వెంటనే మీకు స్పష్టంగా కనిపించడానికి వీలుగా ఈ మార్పులు చేశాం. కొంత కాలం కిందటే దీన్ని మార్చాం. మేం చేసిన చిన్న మార్పును కూడా యూజర్లు గుర్తించడం మాకు చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొంది.




ఇంతకీ ఈ లోగోలో మార్పు ఏంటంటే.. రెండో జీని కొంచెం కుడివైపునకు, ఎల్ ను కొంచెం కుడివైపునకు అలాగే కొంచెం కిందకు జరిపింది. అంతే. లోగోలో చిన్నపాటి మార్పలు చేయడం మొదటిసారి కాదు. గతంలోనూ చేసింది. ఇదిగో ఆ మార్పు GIFలో చూడండి. గూగుల్ ఏం చేసినా వింతే కాబట్టి.. ఈ వార్త మీకు అందిస్తున్నా.




Comments