వాట్సాప్‌లో మనం ఇతరులతో చాట్ చేస్తుంటాం. ఫొటోలు, వీడియోలు పంపుతుంటాం.. స్వీకరిస్తుంటాం. ఈ క్రమంలో అవతలవారికి మనం పంపే మెసేజులు, ఫొటోలు, వీడియోలు చిరాకు తెప్పిస్తే బ్లాక్ చేసే అవకాశం ఉంది. అయితే వారు బ్లాక్ చేసినట్టు మనకు తెలియదు. మనం ఎప్పటిలానే వారికి మెసేజులు, ఫొటోలు, వీడియోలు పంపిస్తుంటాం. మరి వారు మనల్ని బ్లాక్ చేసినట్టు తెలుసుకోవడం ఎలా? అంటే.. కొన్ని మార్గాల ద్వారా వారు మనల్ని బ్లాక్ చేసినట్టు తెలుసుకోవచ్చు. ఆ మార్గాలివే..
1. ఆ కాంటాక్ట్ చివరిసారిగా వాట్సాప్ ఎప్పడు చూశాడో చూడండి లేదా చాట్ విండోలో ఆన్‌లైన్‌లో ఉన్నాడో లేదో చూడండి
ఇది మీరు బ్లాక్ చేయబడ్డారో, లేదో తెలుసుకోవడానికి అత్యంత సులువైన మార్గం. దీని ద్వారా మీరు బ్లాక్ చేయబడ్డారని ధ్రువీకరించలేనప్పటికీ ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి అతని వాట్సాప్ సెట్టింగ్స్‌ను మార్చకుండా ఉంటే మీరు బ్లాక్ చేయబడ్డారో, లేదో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
2. ప్రొఫెల్ పిక్‌ను మార్చలేకుంటే
ఒకవేళ మీరు వాట్సాప్‌లో బ్లాక్ చేయబడితే, మిమ్మల్సి బ్లాక్ చేసిన వ్యక్తి ప్రొఫైల్ చిత్రం మీకు ఎప్పటికీ మారదు. వారు మీతో చాట్ చేస్తున్నప్పుడే మాత్రమే మీరు ఫొటోను చూడగలరు. మీరు అతడు చేసిన మార్పులు చూడలేకపోతే, మీరు బ్లాక్ చేయబడి ఉండవచ్చు.
3. మెసేజ్ పంపినప్పుడు డబుల్ టిక్ పడకపోతే
మీరు వాట్సాప్‌లో బ్లాక్ చేయబడ్డారని ఇంకో మార్గం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అదెలాగంటే.. మీరు మిమ్మల్ని బ్లాక్ చేశారని భావిస్తున్న వ్యక్తికి వాట్సాప్‌లో మెసేజ్ పంపగానే సింగిల్ టిక్ పడుతుంది. అంటే.. మీరు మెసేజ్‌ను విజయవంతంగా పంపారు. డబుల్ టిక్ పడితే మీ మెసేజ్ వారికి చేరినట్టు. ఒకవేళ డబుల్ టిక్ పడలేదనుకోండి.. ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం చేసుకోవాలి.
4. వాట్సాప్ కాల్ చేయండి
మిమ్మల్ని బ్లాక్ చేశారని భావిస్తున్న వ్యక్తికి వాట్సాప్ ద్వారా కాల్ చేయండి. అయితే కాల్ కనెక్ట్ కాదు. ఇలా జరిగితే మీరు బ్లాక్ చేయబడ్డారని అనుకోవచ్చు. ఎన్నిసార్లు ఫోన్ చేయడానికి ప్రయత్నించినా మీరు సఫలం కాకపోతే మీరు బ్లాక్ చేయబడ్డట్టే.
5. ఆ కాంటాక్ట్‌ను ఏదైనా గ్రూప్‌లో చేర్చండి
పైన చెప్పుకున్న అన్ని బ్లాక్ చేయకపోవడం వల్లే జరగకపోవచ్చు. ఒక్కోసారి నెట్‌వర్క్ లోపం, ఇతర సాంకేతిక కారణాల వల్ల కూడా జరగొచ్చు. అందుకని మీరు ఇంకో మార్గం ద్వారా బ్లాక్ చేయబడ్డారో, లేదో కచ్చితంగా తెలుసుకోవచ్చు. అదెలా అంటే.. మీరు ఏదైనా గ్రూప్‌లోకి ఏదైనా కాంటాక్ట్ నెంబర్‌ను యాడ్ చేయండి. అప్పుడు మీకు 'ఈ నెంబర్‌ను యాడ్ చేయడానికి మీకు ఎలాంటి అధికారం లేదు' అని మెసేజ్ వస్తుంది. ఇలా వస్తే మిమ్మల్ని సంబంధిత వ్యక్తి బ్లాక్ చేసినట్టేనని 100 శాతం ధ్రువీకరించుకోవచ్చు.
Comments
Post a Comment
దయచేసి మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే ఇక్కడ రాయగలరు. బ్యాక్ లింక్స్ అంగీకరించబడవు.