యూనికోడ్ లో యాపిల్ కీబోర్డు ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా?


తెలుగు టైపింగ్ వచ్చినవారు ఈ సాఫ్ట్ వేర్(te_apple) ఇన్ స్టాల్ చేసుకొని యూనికోడ్ లో యాపిల్ కీ బోర్డు లే ఔట్ పొందవచ్చు. ఇన్ స్టాలేషన్ ఎలా అన్నది ఈ వీడియోలో వివరించాను. యూనికోడ్ లో వట్రుసుడి(ృ) టైప్ చేయడానికి ఇందులో అనుకూలించదు. అయితే దాన్ని పొందడానికి ఒక ట్రిక్ ఉంది. దాన్ని తదుపరి వీడియోలో వివరిస్తాను.


వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేసి తొలివెలుగు లో చూడగలరు.

మీకు యాపిల్ కీబోర్డులో తెలుగు టైప్ చేయడం వచ్చి ఉంటే.. యూనికోడ్ సాఫ్ట్ వేర్ ద్వారా మీ కంప్యూటర్లో లేదా ఫేస్ బుక్, ఇంటర్నెట్ ఎక్కడైనా సరే తెలుగు టైప్ చేయొచ్చు.
మీరు te_apple ఇన్ స్టాల్ చేశాక.. తెలుగు నుంచి ఇంగ్లిష్ కు, ఇంగ్లిష్ నుంచి తెలుగుకు మారాలంటే.. alt+shift నొక్కుతూ ఉంటే.. అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు మారుతుంది.. విండోస్ కీ ప్లస్ స్పేస్ కొట్టినా కూడా మారుతుంది.

మీకు తెలుగు కీబోర్డు టైపింగ్ రాకపోతే.. గూగుల్ ఇన్ పుట్ టూల్ అన్న సాఫ్ట్ వేర్ ద్వారా ఇంగ్లిష్ లో టైప్ చేస్తే తెలుగు వచ్చేలా చేయొచ్చు.. అది తదుపరి వీడియోలో చూడండి.. 

Comments