ఫోన్ పోతే వెంటనే ceir.gov.in లో IMEI నంబర్ ఇచ్చి బ్లాక్ చేయండి. బ్లాక్ చేసిన ఫోన్‌లో ఏ సిమ్ వేసినా పనిచేయదు. ముందు పోలీస్ ఫిర్యాదు చేసి, ఆ కాపీతో CEIR లో రిక్వెస్ట్ పెట్టండి.
IMEI నంబర్ ఎక్కడ దొరుకుతుంది?
- ఫోన్ బాక్స్ మీద ప్రింట్ అయి ఉంటుంది
- బిల్లు మీద ఉంటుంది
- ఫోన్ ఉన్నప్పుడు *#06# డయల్ చేస్తే స్క్రీన్ మీద కనబడుతుంది
- Google account → Your devices లో కూడా ఉంటుంది
ఇప్పుడే ఒకసారి చూసి, IMEI నంబర్ ఎక్కడైనా సేవ్ చేసుకోండి. పోయిన తర్వాత వెతకడం కష్టం.
ఫోన్ పోతే వరుసగా ఇవి చేయండి
- పోలీస్ ఫిర్యాదు చేయండి. FIR లేదా acknowledgement కాపీ తీసుకోండి.
- సిమ్ బ్లాక్ చేయించండి — మీ ఆపరేటర్‌కి కాల్ చేసి డూప్లికేట్ సిమ్ తీసుకోండి.
- ceir.gov.in లో Block Stolen/Lost Mobile ఎంచుకుని IMEI, FIR వివరాలు ఇవ్వండి.
- google.com/android/find లో ఫోన్ లొకేషన్ చూసి, డేటా ఎరేజ్ చేయవచ్చు.
- బ్యాంక్ యాప్‌లు, UPI — మీ బ్యాంక్‌కి చెప్పి బ్లాక్ చేయించండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
IMEI బ్లాక్ చేస్తే ఫోన్ తిరిగి వస్తుందా?
ఫోన్ దొరుకుతుందని గ్యారెంటీ
లేదు. కానీ దొంగకి ఆ ఫోన్ పనికిరాకుండా పోతుంది, అమ్మడం కూడా కుదరదు.
ఫోన్ తిరిగి దొరికితే?
అదే CEIR సైట్‌లో Un-block రిక్వెస్ట్
పెట్టవచ్చు.
FIR లేకుండా బ్లాక్ చేయవచ్చా?
కుదరదు. CEIR కి ఫిర్యాదు నంబర్ తప్పనిసరి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం Telugu Techy ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేయండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే ఇక్కడ రాయగలరు. బ్యాక్ లింక్స్ అంగీకరించబడవు.