goTenna: నెట్ వర్క్ లేకున్నా SMS పంపుకోవచ్చిలా..


మీరు మీ స్నేహితులతో కలసి అటవీ పర్యటనకు వెళ్లారు.. హఠాత్తతుగా ప్పిపోయారు.. అక్కడ సెల్ నెట్ వర్క్ లేదు.. మీకు దారీతెన్నూ తెలీదు. ఇలాంటి సమయంలో మీ దగ్గర goTenna కంపెనీ రూపొందించిన ఈ చిన్న పరికరం ఉంటే.. మీరు దైర్యంగా ఉండొచ్చు. ఈ పరికరం మీ phoneకు Bluetooth ద్వారా అనుసంధానమై.. దాని నుంచి ఓ చిన్న పాటి ఫ్రీక్వెన్సీ గల రేడియో తరంగాలను విడుదల చేస్తుంది. ఇవి పలు మైళ్లపాటు ప్రయాణించగలవు. గరిష్టంగా 50 మైళ్ల వరకు వెళ్లగలవు.  మీ సెల్ ఫోన్ లో iOs లేదా Android అప్లికేషన్ ద్వారా ఇతర goTenna యూజర్లకు అపరిమితమైన, యాడ్స్ లేని మెసేజ్ పంపుకోవచ్చు లేదా మీ జీపీఎస్ లొకేషన్ మీ స్నేహితులకు తెలియజేయవచ్చు. అయితే వాయిస్ కాల్స్ సౌకర్యం మాత్రం ఉండదు. ప్రస్తుతానికి జత పరికరాలను 150 డాలర్ల చొప్పున పరిమిత సంఖ్యలో వీటిని విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. తర్వాత జత 300 డాలర్లు చేయాలని భావిస్తోంది.


Comments