iReff: తాజా రీచార్జి ఆఫర్లు తెలిపే android app
ఇంగ్లిష్లో టెక్నాలజీ సంగతుల కో్సం చూడండి ‘తొలివెలుగు’ బ్లాగ్మీరు మీ ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జి చేసే ముందు ఓ క్షణం ఆగండి. మీ అవసరానికి తగిన రీచార్జి ప్రొడక్టు/ధర ఏదో చూసి మరీ ఎంచుకోండి. అయితే ఎలా అన్న ప్రశ్న వస్తుంది. మీ దగ్గర ఓ యాండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే.. అందులో iReff అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు. ఇది తాజా రీచార్జి ఆఫర్లు, ఏ ప్లాన్ వేసుకుంటే ఎలాంటి లాభాలు అన్న విషయాలను చక్కగా వివరిస్తుంది.
- Topup, SMS, Data(GPRRS/2G మరియు 3G), Local, STD, ISD ఇలా పలు సాధారణ కేటగిరీల వారీగా మీరు సమాచారం సరిచూసుకోవచ్చు. లేదంటే శక్తిమంతమైన text search సౌకర్యం ఉపయోగించి కూడా మీ అవసరానికి తగిన ఆఫర్ ఎంచుకోవచ్చు.
- మీరు Topup వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్లు ఇలా చాలా వివరాలు ఇందులో పొందొచ్చు.
- డేటా ఏ రోజుకారోజు ఇందులో అప్డేట్ అవుతుంది. బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా ప్రయోగదశలో ఉంది.
iReff ప్రస్తుతం అన్ని టెలికం సర్కిళ్లలో కింది వాటికి సంబంధించిన సమాచారం అందిస్తోంది:
- Airtel latest plan for 3g and 2g and talktime
- Aircel latest plan for 3g and 2g and talktime
- BSNL / MTNL
- Idea
- Loop Mobile
- MTS
- Reliance GSM
- Reliance CDMA
- Tata Docomo
- Tata Indicom
- T24
- Uninor
- Videocon
- Virgin Mobile CDMA
- Virgin Mobile GSM
- Vodafone
Comments
Post a Comment
దయచేసి మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే ఇక్కడ రాయగలరు. బ్యాక్ లింక్స్ అంగీకరించబడవు.