రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు ఆధార్ కార్డుపై సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, సిమ్ కార్డులు తీసుకోవడానికి, స్కూళ్లలో ప్రవేశాలకు ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన సంగతి విదితమే. అయితే ఆధార్ ను పాన్ కార్డుతో అనుసంధానించడం, ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుకు ఆధార్ తప్పనిసరని కోర్టు విస్పష్టంగా తీర్పునిచ్చింది.
ఈ నేపథ్యంలో ఆధార్ ను పాన్ కార్డుతో అనుసంధానం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..
మీరు రిజిస్టర్డ్ యూజర్ అయి ఉంటే www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో 'లింక్ ఆధార్ ఆప్షన్' క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత మీ పాన్ నెంబర్ ను, ఆధార్ నెంబర్ ను, మీ పేరును ఎంటర్ చేసిన సబ్మిట్ చేయాలి. అయితే పేరును ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం. ఆధార్ లో మీ పేరు ఎలా ఉందో అలాగే నమోదు చేయాలి. తప్పులు లేకుండా జాగ్రత్తలు వహించాలి. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పేరు ఎంటర్ చేసిన తర్వాత వెంటనే ఆధార్ ఆర్గనైజేషన్ (యూనిక్ ఐడింటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) పరిశీలించి .. పాన్ తో ఆధార్ అనుసంధానాన్ని ధ్రువీకరిస్తుంది.
మీరు రిజిస్టర్ట్ యూజర్ కాకపోయి ఉంటే.. www.incometaxindiaefiling.gov.in ను ఓపెన్ చేసి లాగిన్ ఐడీ, పాస్ వర్డ్, డేట్ ఆఫ్ బర్డ్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత 'లింక్ యువర్ పాన్ కార్డ్ విత్ ఆధార్ కార్డ్' పేరుతో ఒక పాప్ అప్ విండో కనిపిస్తుంది. ఒకవేళ పాప్ అప్ విండో కనిపించకపోతే 'ప్రొఫైల్ సెట్టింగ్స్' పై క్లిక్ చేసి 'లింక్ ఆధార్' ను క్లిక్ చేయాలి. అక్కడ మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ తదితర వివరాలు కనిపిస్తాయి. ఆధార్ కార్డుపై ఉన్నవాటితో ఆ వివరాలను ఒకసారి సరిగా ఉన్నాయో, లేదో చూసుకోండి.
వివరాలు సరిగానే ఉన్నట్టయితే మీ ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'లింక్ నవ్' బటన్ పై క్లిక్ చేయండి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవగానే పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం విజయవంతమైనట్టు ఒక పాప్ అప్ మెసేజ్ స్క్రీన్ పై వస్తుంది. ఒక పన్ను చెల్లింపుదారుడు 567678 లేదా 56161 కు SMS పంపడం ద్వారా పాన్ తో ఆధార్ ను లింక్ చేయవచ్చు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఆధార్లోని వాస్తవ సమాచారంతో పోలిస్తే పన్ను చెల్లింపుదారుడు ఇచ్చిన పేరు ఒకేలా లేకపోతే.. ఆధార్లో నమోదైన మొబైల్ నంబర్ కు ఒక వన్ టైమ్ పాస్ వర్డ్ (ఆధార్ OTP) పంపుతారు. పన్ను చెల్లింపుదారులు పుట్టినతేదీ, జెండర్, పేరు తదితర వివరాలు ఆధార్, పాన్ లో ఒకేలా ఉండేలా చూసుకోవాలి.
Comments
Post a Comment
దయచేసి మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే ఇక్కడ రాయగలరు. బ్యాక్ లింక్స్ అంగీకరించబడవు.