స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు, ప్రధానంగా ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ సందేశాలలో భాగంగా వచ్చిన మీడియా ఫైళ్లను వీక్షించడాన్ని వాట్సాప్ సులభతరం చేస్తుంది. దీనికోసం వాట్సాప్.. నోటిఫికేషన్ మీడియా ప్రివ్యూను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వాట్సాప్ కు వచ్చిన యూఆర్ఎల్ లింక్ అనుమానాస్పదమైనదా? కాదా? అనేది వినియోగదారులు తెలుసుకోవచ్చు. వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేసుకుంటే మనకొచ్చే యూఆర్ఎల్ లింక్స్ మంచివో, చెడ్డవో తెలుసుకోవచ్చు.
వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేసుకుంటే మనకు మెసేజుల రూపంలో వచ్చిన ఫైల్స్ ను నోటిఫికేషన్స్ ప్యానెల్ లో కుడివైపున చూడటానికి మనకు వాట్సాప్ అనుమతిస్తుంది. ఇప్పటి వరకు, నోటిఫికేషన్ల ప్రదేశంలో అలాంటి నోటిఫికేషన్లు కెమెరా చిహ్నాన్ని చూపించాయి. ఇకనుంచి మనకొచ్చిన ఒక మీడియా ఫైల్ను చూడడానికి దానిని తెరవవలసి ఉంటుంది. ప్రివ్యూలు కూడా GIF లను చూపుతాయి. మీరు 'నోటిఫికేషన్ ఎక్స్టెన్షన్' అందుకున్నట్లయితే ధృవీకరించడానికి మీరు ఒక చిత్రాన్ని మీకు పంపమని అడగవచ్చు. అంతేకాకుండా నోటిఫికేషన్ నుంచి ప్రివ్యూను చూడటానికి నోటిఫికేషన్ కింద స్వైప్ చేయండి,
ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ఐవోఎస్ 10లో మాత్రమే ఉంది. తర్వాత ఓఎస్ వెర్షన్ పనిచేసే స్మార్ట్ ఫోన్లలోకి అందుబాటులోకి రానుంది. వాట్సాప్ ద్వారా ఫోన్ కు వచ్చిన ఏదైనా యూఆర్ఎల్ లింక్ అనుమానాస్పదమైనదా? కాదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి వాట్సాప్ యూజర్లకు సహాయం చేస్తుంది. ఒక యూజర్ కు వాట్సాప్ ద్వారా ఒక యూఆర్ఎల్ లింక్ వచ్చినప్పుడు వాట్సాప్ ఆ లింక్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలుపుతుంది. ఒకవేళ ఆ యూఆర్ఎల్ లింక్ సక్రమమైనది కాకపోతే ఆ లింక్ ను అనుమానించిదగిన లింక్ గా గుర్తించాలని యూజర్లను నోటిఫికేషన్ రూపంలో వాట్సాప్ హెచ్చరిస్తుంది. మనకు వచ్చిన యూఆర్ఎల్ టెక్ట్స్ పైన రెడ్ కలర్ లో నోటిఫికేషన్ చూపుతుంది. ఈ ఫీచర్ వాట్సాప్ కు వచ్చే నకిలీ వార్తలను అరికట్టడానికి, వాటిని గుర్తించడానికి కూడా సహాయపడుతుంది.
Comments
Post a Comment
దయచేసి మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే ఇక్కడ రాయగలరు. బ్యాక్ లింక్స్ అంగీకరించబడవు.