వాట్సాప్ లో మనం చెత్తలా పేరుకుపోయిన మేసేజ్ లను డిలీట్ చేస్తుంటాం. ఈ క్రమంలో ఒక్కోసారి మనకు అవసరమైన, కావాల్సిన మెసేజ్ లను, చాట్ లను కూడా పొరపాటున డిలీట్ చేస్తాం. తర్వాత కావాల్సి వచ్చినప్పుడు వాటిని చూసుకుంటే కనిపించక చింతిస్తాం. ఇది దాదాపు మనందరికి అనుభవమైన సంఘటనే. వాట్సాప్ బ్యాకప్ ద్వారా కొన్ని మెసేజ్ లను పొందొచ్చు కానీ.. వాట్సాప్ లో ఒకసారి డిలీట్ చేసిన మెసేజ్ లను, చాట్ లను తిరిగిపొందడం దాదాపు అసాధ్యం. అయితే కొన్ని విధానాల ద్వారా వాట్సాప్ లో డిలీట్ అయిన మెసేజ్ లను, చాట్ లను తిరిగి పొందొచ్చు.
వాట్సాప్ లో డిలీట్ చేసుకోవడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. కానీ సులువైన పద్ధతులు లేవు. డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ ప్రెస్ చేస్తే పంపిన మనకు, వెళ్లినవారికి మెసేజ్ డిలీట్ అవుతుంది. వాట్సాప్ లో డిలీట్ అయిన సమాచారం తిరిగిపొందాలంటే ఒక ఆప్షన్ ప్రెస్ చేస్తే కనీసం హోల్డ్ లో ఉంచుకునే అవకాశం ఉంది. రెండు విధాల ద్వారా వాట్సాప్ లో డిలీట్ అయిన మెసేజ్ లు చదువుకోవడానికి అవకాశం ఉంది. అయితే గ్యారెంటీ అని మాత్రం చెప్పలేం.
ఇలా ఎందుకంటే.. కొన్ని పరిమితుల వల్ల మనం ఒక్కసారి డిలీట్ చేసినా తర్వాత అవి థర్డ్ పార్టీ మెసేజె స్ అవుతాయి. వాటిని తిరిగిపొందడం సులువుకాదు. థర్డ్ పార్టీ యాప్స్ ను పొందడం, వాటి ద్వారా పోయిన డేటాను, చాట్ ను పొందడానికి వాట్సాప్ అనుమతించదు. కాబట్టి ముందుగా వాట్సాప్ యాప్ ప్రైవసీ పాలసీ ఎలా ఉందో చదవాలి. దాన్ని బట్టి అడుగులు వేయాల్సి ఉంటుంది.
స్పానిష్ బ్లాగ్ ఆండ్రాయిడ్ జెఫే ప్రకారం.. వాట్సాప్ చాట్ నోటిఫికేషన్స్ మన ఫోన్ మెమొరీలో అన్ లాగ్ చేయబడి ఉంటాయి. దాన్ని యాక్సెస్ చేసి ఫోన్ ను రీస్టోర్ చేసినప్పుడు మాత్రమే వాటిని తిరిగిపొందగలం. స్పానిష్ బ్లాగ్ ఆండ్రాయిడ్ జెఫే ఏమి తెలుపుతుందంటే.. సెండర్.. డిలీట్ ఎవ్రీవన్ ఆప్షన్ ప్రెస్ చేశాక కూడా డివైజ్ రీస్టోర్ చేస్తే రెసిపెంట్ తిరిగి డిలీట్ అయిన మెసేజెస్ పొందుతారు.
ఒకసారి డిలీట్ అయిన మెసేజ్ లు పొందాలంటే.. ఈ కింది విధంగా చేయండి.
స్టెప్-1: ప‌్లే స్టోర్ లోకి వెళ్లి ఇన్ స్టాల్ యాప్ కాల్డ్ నోటిఫికేషన్స్ హిస్టరీని డౌన్ లోడ్ చేసుకోండి. దాన్ని రన్ చేసి అది అడుగుతున్న అన్ని అనుమతులు మీ ఫోన్ సెట్టింగ్సలో ఇవ్వండి.
స్టెప్-2: తర్వాత నోటిఫికేషన్ లాగ్ నుంచి మీకు కావాల్సిన మెసేజ్ ను సెర్చ్ చేసుకోండి. ఇలా మీకు వచ్చినా అన్నింటి నుంచి ముఖ్యమైన వాటిని వేరేగా తీసుకోండి.
స్టెప్-3: ఆండ్రాయిడ్ ఫోన్లు లాంచర్స్ ను అనుమతిస్తాయి. ఉదాహరణ.. నోవా లాంచర్స్. అందులోని సెట్టింగ్సును ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా మీరు వాట్సాప్ లో ఇంతకుముందు చాడని మెసేజులను చూడొచ్చు. డిలీట్ చేసినవాటిని మాత్రం చూడలేరు. ఇది ఈ లాగ్ కి ఉన్న పరిమితి.
రెండో విధానంలో సెండర్ కి అవకాశం ఉంది. ఒకవేళ రిసిపెంట్ మెసేజ్ డిలీట్ చేయకపోతే మనం మెసేజులను వాట్సాప్ బ్యాక్ లో పొందొచ్చు.
సాధారణంగా వాట్సాప్ బ్యాకప్ రాత్రి సమయంలో జరుగుతుంది. మెస్సేజులు ఫోన్ మెమొరీలో సేవ్ అవుతాయి. అలా మనం వాటిని చూడొచ్చు. ఒకవేళ అనుకోకుండా మెసేజ్ డిలీట్ అయితే స్టోరేజ్ ఆప్షన్ లో తిరిగి పొందొచ్చు.
ఇలా చేయాలంటే ముందు ఫోన్ నుంచి వాట్సాప్ ను డిలీట్ చేసి డూప్లికేట్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. మళ్లీ అన్నింటిని స్రెచ్ చేసుకోవడం ద్వారా వాటిని రీస్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఫోన్ రిఫ్రెష్ చేసి వాట్సాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ యాడ్ చేయాలి. ఓటీపీని యాడ్ చేయాలి. పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మెసేజ్ రీస్టోర్ ఆప్షన్ వస్తుంది. అక్కడ ప్రెస్ చేస్తే మీకు డేటా వస్తుంది. ఈ రెండు మెథడ్స్ ద్వారా మీరు డేటాను పొందొచ్చు. మీకు వేరే మెథడ్స్ తెలిస్తే దయచేసి కింద కామెంట్ చేయండి.
Comments
Post a Comment
దయచేసి మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే ఇక్కడ రాయగలరు. బ్యాక్ లింక్స్ అంగీకరించబడవు.