అక్టోబర్ 11న శాంసంగ్ ఫోర్ లెన్స్ కెమెరా ఫోన్ విడుదల

స్మార్ట్ ఫోన్ కంపెనీ దిగ్గజం.. శాంసంగ్ ఈ నెల 11న నాలుగు కెమెరాలతో ఫోన్ విడుదల చేయనుంది. ఈ ఏడాది ట్రిపుల్ లెన్స్ రియర్ గెలాక్సీ ఏ7 ఫోన్ ను శాంసంగ్ ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాలుగు లెన్స్ లతో కూడిన రియర్ కెమెరా స్మార్ట్ పోన్ ను మరో వారం రోజుల్లో ఆవిష్కరించనుంది. శాంసంగ్ కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ మార్కెట్ వర్గాలు మాత్రం శాంసంగ్ ఈ ఫోన్ ను ఆవిష్కరించబోతోందని చెబుతున్నాయి..

శాంసంగ్.. మీడియాకు పంపిన ఆహ్వానంలో  '4x ఫన్ - ఏ గెలాక్సీ ఈవెంట్' అని ఉండటం గమనార్హం. అక్టోబర్ 11న మలేసియాలో జరిగే ఒక కార్యక్రమంలో ఫోర్ లెన్స్ రియర్ కెమెరా ఫోన్ ను  మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఇప్పటికే విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఏ7లో 24 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సార్, 5 ఎంపీ డెప్త్ సెన్సార్, లో లైట్ సెన్సార్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. చాలా డ్యుయెల్ లెన్స్ కెమెరా ఫోన్లలో వైడ్ యాంగిల్ వ్యూ ఉండదు.  గెలాక్సీ ఏ7లో మాత్రం వైడ్ యాంగిల్ వ్యూ ఉంది. 

అమ్మకాల్లో గెలాక్సీ ఏ7 రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫోర్ లెన్స్ రియర్ కెమెరాతో శాంసంగ్ విడుదల చేయబోతున్న ఫోన్ మార్కెట్లో ఎన్ని సంచనాలు నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే. గెలాక్సీ నోట్ 9 లేదా గెలాక్సీ 10గా దీనిపేరు ఉండొచ్చని భావిస్తున్నారు. ఏదిఏమైనా అధికారికంగా ప్రకటిస్తేనే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. 

Comments